తన వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతో ఏకంగా రెవిన్యూ ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకున్నాడో వ్యక్తి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తుండటం విశేషం. చిగురుమామిడి తాహసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పూధరి రాజు అనే అధికారిని, కోహెడ మండలం తీగల గుంటపల్లె గ్రామానికి చెందిన రావుల తిరుపతి అనే వ్యక్తి రోజున చిగురుమామిడి రెవెన్యూ శివారులోని ప్రభుత్వ స్థలంలో మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. దీన్ని అడ్డుకుని టిప్పర్లు, జెసిబిని సీజ్ చేయడంతో.. కోపంతో తిరుపతిరెడ్డి అనే వ్యక్తి తహసిల్దార్ కార్యాలయంలో తన విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ పూదరి రాజును తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, నానా బూతులు తిడుతూ, కాలర్ పట్టుకున్నట్టు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సామల రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chigurumamidi: బూతులు తిట్టి, ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకున్న వ్యక్తి
వ్యాపారాన్ని అడ్డుకున్నాడని ఆగ్రహంతో..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES