చైనా అప్లికేషన్స్ పై ఉక్కు పాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక అడుగు వేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈమేరకు పలు చైనా యాప్స్ పై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఇలా బ్యాన్ అయిన వాటిలో 138 బెట్టింగ్ యాప్స్ ఉండగా, మరో 94 లోన్ యాప్స్ ఉన్నాయి. చైనాతో సంబంధాలున్న చాలా యాప్స్ పై తాము పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తున్న కేంద్రం వెల్లడించింది. అత్యవసరంగా ఇలాంటి యాప్స్ పై బ్యాన్ విధిస్తూ యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. భారత సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేస్తున్న ఈ యాప్స్ ఉన్నాయని, ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కింద వీటిని నిషేధిస్తున్నట్టు పేర్కొంది.
China apps: భారీ ఎత్తున బెట్టింగ్ యాప్స్ , లోన్ యాప్స్ బ్యాన్ చేసిన భారత్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES