Class 9 Girl Dies By Suicide After Alleged Rape: తన ఇంటి పక్కనే ఉండే ఒక ట్రైనీ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ కేసులో నిందితుడైన కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు.
ALSO READ: Murder in Karnataka: కర్ణాటకలో దారుణం: ఆరేళ్ల బాలికను మూడో అంతస్తు నుంచి తోసి చంపిన సవతి తల్లి.!
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) సంజయ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన సోమవారం సంగిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు (14) రైలు పట్టాల వద్ద ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు.
బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తమ కుమార్తెను పక్క ఇంట్లో ఉండే ట్రైనీ కానిస్టేబుల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దారుణం జరిగిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
ALSO READ: Woman Cheating Husband: సహచరులతో కలిసి భర్త వద్ద రూ. 1.73 కోట్లు కాజేసిన భార్య
ప్రస్తుతం నిందితుడు మావ్ జిల్లాలో శిక్షణ పొందుతున్నాడని, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సంజయ్ రాయ్ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి మావ్ జిల్లాకు ఒక పోలీసు బృందాన్ని పంపినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తెకు న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Blackmail: మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. మేనల్లుడిని చంపి, మృతదేహాన్ని కాల్చేసిన మామ


