సత్యసాయి జిల్లా సికే పల్లి వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ యావత్ ఘటనపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన సిఎం చంద్రబాబు, వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండని వార్డెన్, సంబంధిత ఉద్యోగులు, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా.. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు భోజనం సమకూర్చినట్లు కలెక్టర్ వివరించగా, ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశాలు జారీచేశారు.
CM CBN: విద్యార్థులకు భోజనం ఎందుకు వండలేదని మండిపడ్డ సీఎం చంద్రబాబు
సీరియస్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES