Couple Missing After Fishing Trip: చేపల వేటకు వెళ్లి దంపతులు గల్లంతైన ఘటన గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరి ఆచూకీ కోసం SDRF సిబ్బంది ఉదయం నుంచి గాలిస్తున్నారు. ఉదయం వెళ్లిన దంపతులు రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. చేపల వేటకు వెళ్లిన పుట్టి బోల్తా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇంటికి రాకపోవడంతో అనుమానం:
చేపల వేటకు వెళ్లి దంపతులు గల్లంతైన ఘటన గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు అందించిన సమాచారంతో SDRF సిబ్బంది ఉదయం నుంచి గాలిస్తున్నారు. చెపల కోసం ఉదయం చెరవు వద్దకు వెళ్లిన దంపతులు రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. చేపల వేటకు వెళ్లిన పుట్టి బోల్తా పడి ఉండడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
వివరాల ప్రకారం..
గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన సంధ్య, రాముడు.. మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. రాత్రి అయినా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చెరవు వద్దకు వెళ్లారు. దంపతుల కోసం గాలించారు .చేపల వేటకు వెళ్లిన పుట్టి బోల్తా పడి ఉండడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యుల సమాచారంతో ఉదయం గం.6.00లకు చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు గల్లంతైన భార్య భర్తల కోసం గాలిస్తున్నారు. SDRF సిబ్బంది సహాయంతో వెతుకున్నట్లు పోలీసులు తెలిపారు.


