గత 24 గంటల్లో 2,151 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. గత 5 నెలల్లో మొదటిసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారికంగా 11,903 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఓవైపు ఎండలు పెరుగుతుండగా మరోవైపు ఇలా కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిస్తోంది.
- Advertisement -
డైలీ పాజిటివిటీ కేసుల విషయానికి వస్తే 1.51శాతం కేసులు నమోదయ్యాయి. ఇక వీక్లీ పాజిటివిటీ రేట్ అయితే ఏకంగా 1.53శాతంగా నమోదవ్వటం విశేషం. నేషనల్ రీకవరీ రేట్ 98.78శాతంగా ఉంది. కోవిడ్ టీకాలు దేశవ్యాప్తంగా వేస్తూనే ఉండగా టీకాలు వేసుకున్న వారి జనాభా 220.65 కోట్లుగా ఉంది. వీరిలో కేవలం 22.86 కోట్ల మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారు.