Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుCyber Crime: రుణాలిచ్చే యాప్‌కే కుచ్చు టోపీ.. 3 గంటల్లో రూ. 49 కోట్లు కొట్టేసిన...

Cyber Crime: రుణాలిచ్చే యాప్‌కే కుచ్చు టోపీ.. 3 గంటల్లో రూ. 49 కోట్లు కొట్టేసిన సైబర్‌ కేటుగాళ్లు

Cyber Crime Moneyview App: అవకాశం దొరికితే సైబర్‌ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజల నుంచి బడా వ్యాపారవేత్తలు, వృద్ధులు, రిటైర్డ్‌ ఉద్యోగులు.. ఇలా ఎవరినైనా సరే ఈజీగా టార్గెట్‌ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఉద్యోగం పేరుతో, వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇస్తామంటూ, పార్ట్‌ టైం ఉద్యోగం, ఈజీ మనీ ఇలా ఎన్నో రకాలుగా నిరుద్యోగుల నుంచి సైతం డబ్బు దండుకున్నారు. అయితే తాజాగా జరిగిన మోసం.. వీటన్నిటికీ విరుద్ధం. ఈ సారి సైబర్‌ నేరగాళ్లు ఏకంగా రుణాలిచ్చే యాప్‌కే కుచ్చు టోపీ పెట్టారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/indian-star-batsman-shreyas-iyer-health-update/

రుణాలు మంజూరు చేసే యాప్ ‘మనీవ్యూ’ నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు రూ. 49 కోట్ల కొల్లగొట్టారు. ఈ యాప్ API సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు.. కేవలం మూడు గంటల వ్యవధిలోనే డబ్బు దోచేశారు.  విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మనీవ్యూ యాప్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యాప్‌ను దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన సైబర్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.

ఈ మేరకు బెంగళూరు సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ వివరాలు వెల్లడించింది. మనీవ్యూ యాప్‌ ఏపీఐ సిస్టమ్‌లోకి చొరబడి కేవలం మూడు గంటల వ్యవధిలోనే రూ. 49 కోట్లను కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు.. వాటిని 653 నకిలీ ఖాతాలలోకి బదిలీ చేశారని తెలిపింది. దుబాయ్‌లోని భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి, బెళగావికి చెందిన ఇస్మాయిల్ వద్ద నుంచి వర్చువల్ ప్రైవేటు సర్వర్‌ను కొనుగోలు చేసి ఈ సైబర్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇస్మాయిల్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన మరొక వ్యక్తిని బెంగళూరు సీసీబీ అరెస్టు చేసింది. 

Also Read: https://teluguprabha.net/viral/american-youtuber-tyler-oliveira-at-gorehabba-celebrations-video/

కాగా, మహారాష్ట్రకు చెందిన రెండో నిందితుడి పేరు మీద ఉన్న నకిలీ ఖాతాకు సైతం డబ్బు బదిలీ అయినట్లు సీసీబీ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇతర బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.10 కోట్లను సీసీబీ ఫ్రీజ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి దుబాయ్‌లో ముగ్గురిని, హాంకాంగ్‌లో ఇద్దరిని అనుమానితులుగా గుర్తించినట్లు తెలిపింది. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బెంగళూరు సీసీబీ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad