Rajasthan: కన్నతల్లిని కూతురు అతిదారుణంగా హత్యచేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న తల్లిని కారుతో బలంగా ఢీకొట్టించింది. దీంతో తీవ్ర గాయాలపాలైన తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. ఇది సాధారణ రోడ్డు ప్రమాదంలా నిమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. అయితే తల్లిని కూతురు ఎందుకు హత్య చేయించిందో తెలుసుకుందాం!
కారుణ్య నియామకం కోసం తల్లిని చంపిన కూతురు: తండ్రి మరణానంతరం ప్రభుత్వం ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగాన్ని తల్లి తీసుకుందనే కక్షతో కుమార్తె అత్యంత దారుణానికి పాల్పడింది. ఆస్తిమొత్తం తనకే దక్కాలనే దురాశతో కన్నతల్లిని చంపించింది. చివరకు పోలీసుల విచారణలో అడ్డంగా దొరికింది. రాజస్థాన్‌లోని ప్రతాప్‌నగర్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రవీంద్రనగర్‌కు చెందిన నీరజ్‌శర్మ భర్త ఏడాది క్రితం మరణించారు. దీంతో ఆమెకు కారుణ్య నియామకం కింద కోర్టులో ఎల్‌డీసీ(LDC) ఉద్యోగం వచ్చింది. అయితే ఈ ఉద్యోగం తనకు కావాలని ఆమె కుమార్తె డిమాండ్ చేసింది. దానికి తల్లి ఒప్పుకోలేదు. దీంతో కన్నతల్లిపై కోపాన్ని పెంచుకుంది. ఎలాగైనా తనతల్లిని అడ్డుతోలగించి.. ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలని డిసైడ్ అయింది.
Also read-Hayathnagar: కార్పెంటర్ టూ ఘరానా దొంగ.. బెట్టింగ్ మోజులో 69 చోరీలు!
బంధువులతో కలిసి భారీ స్కెచ్: తల్లిని అంతం చేసి ఉద్యోగంతో పాటు ఆస్తిని పొందాలే దురాశతో సమీప బంధువులతో కలిసి తల్లిన చంపేందుకు కుట్ర చేసింది. పథకం ప్రకారం డుచుకుంటూ వెళ్తున్న తల్లిని కారుతో బలంగా ఢీకొట్టించింది. దీంతో తీవ్ర గాయాలపాలైన తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. ఇది సాధారణ రోడ్డు ప్రమాదంలా నిమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రమాదంపై నీరజ్ శర్మ సోదరుడు రాకేశ్‌కు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ కుట్రలో భాగమైన నిందుతులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రంజిత్ శర్మ తెలిపారు.

