ఢిల్లీలోని ప్రసిద్ధ లీలా ప్యాలెస్ హోటల్ లో రోజుల తరబడి ఉండి బిల్లు ఎగ్గొట్టి వెళ్లాడో మోసగాడు. తీరా వివరాల్లోకి వెళితే అతను విలాసవంతమైన జీవితం గడిపేందుకు అబు దబి రాజకుటుంబం పేరును ఉపయోగించినట్టు తేలింది. లగ్జరీ హోటల్ లో 4 నెలలపాటు గడిపిన అతను ఏకంగా 23 లక్షల బిల్లు ఎగ్గొట్టి దర్జాగా కుచ్చుటోపీ పెట్టాడు. మహమ్మద్ షరీఫ్ అనే అతని కోసం ఢిల్లీ పోలీసులు వేటలో ఉన్నారు. ఆగస్టు 1వ తేదీన లీలా ప్యాలెస్ లో దిగిన షరీఫ్ నవంబర్ 20న చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. కస్టమర్ ఉడాయించాడన్న సంగతి గుర్తించిన స్టాఫ్ రూములో వెతికితే పలు విలువైన వస్తువులు.. వెండి గిన్నెలతోపాటు ముత్యాల ట్రే వంటివి వెంట తీసుకెళ్లినట్టు తేలింది. బిజినెస్ పనుల మీద ఇండియా వచ్చినట్టు హోటల్ స్టాఫ్ తో అతను చెప్పుకున్నాడు. 35 లక్షల రూపాయల హోటల్ బిల్లులో అతను చెల్లించింది కేవలం 11.5 లక్షలే. మిగతా 20 లక్షల రూపాయల చెక్ ను హోటల్ కు ఇచ్చి అతను వెళ్లిపోగా ఆ చెక్కు చెల్లకపోవటంతో పోలీసులకు లీలా ప్యాలెస్ కంప్లైంట్ చేసింది.
Delhi: 4 నెలల బిల్లు.. 25,00,000..దర్జాగా ఎగ్గొట్టాడు..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES