Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుDelhi crime: ఈ నగరానికి ఏమైంది? క్రైమ్ క్యాపిటల్ గా ఢిల్లీ

Delhi crime: ఈ నగరానికి ఏమైంది? క్రైమ్ క్యాపిటల్ గా ఢిల్లీ

ఢిల్లీలో ఒకటి తరువాత ఒకటి ఘోరాతి ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. హిట్ అండ్ రన్ ప్రమాదంలో అంజలి అనే అమ్మాయి మృతి చెందగా తాజాగా మరో ఇంజినీరింగ్ అమ్మాయి ఢిల్లీలోని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 5 రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో సాంట్రో కారు ఒక అమ్మాయిని ఢీ కొట్టడంతో ప్రస్తుతం ఆమె లైఫ్ సపోర్ట్ మీద ఉంది. డిసెంబర్ 31 రాత్రి 9 గంటల సమయంలో రోడ్ పక్కన నడుస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పై దూసుకెళ్లగా ఈ ప్రమాదంలో స్వీటీ కుమారి అనే ఓ అమ్మాయి తలకు పెద్ద గాయాలయ్యాయి. బ్రెయిన్ ఆపరేషన్ తరువాత ఇప్పటికి అపస్మారక స్థితిలో స్వీటీ ఉంది. బిహార్ కు చెందిన స్వీటీ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హిట్ అండ్ రన్ కేసులో ఎటువంటి క్లూ ఇప్పటివరకూ లభించలేదు.

- Advertisement -

మరోవైపు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కత్తితో పొడిచిన మరో ప్రమాదంలో ఢిల్లీకి చెందిన అమ్మాయి మృత్యువుతో పోరాడుతోంది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 21 ఏళ్ల ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పాక అతను ఆమెపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఢిల్లీలోని జగజ్జీవన్ రాం ఆసపత్రిలో ఈమె చికిత్స పొందుతోంది. ఐదేళ్లపాటు సుఖవీందర్ అనే 22 ఏళ్ల అబ్బాయితో ఈమె రిలేషన్షిప్ లో ఉండి బ్రేకప్ చెప్పుకునారు. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఆమె ఇంటివద్దే సుఖవీందర్ దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్అయ్యాయి. ఆతరువాత సుఖవీందర్ అంబాలాకు పారిపోగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad