తన ప్రేమికురాలి భర్తను చంపి..తగులబెట్టాడు ఓ కిరాతక ప్రేమికుడు. ఈ ఘోరం రాజధాని ఢిల్లీలో జరిగింది. వజీరాబాద్ ఏరియాలో జరిగిన ఈ అరాచకంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మున్షిద్దీన్ అనే వ్యక్తికి తన స్నేహితురాలైన ఓ వివాహితతో లవ్ అఫైర్ సాగుతోంది. రషీద్ అనే ఆమె భర్త, నిందితుడు ఇద్దరూ ప్లంబర్, ఎలక్ట్రీషియన్లుగా కలిసి పనిచేసేవారు. తరచూ వీళ్లద్దరూ ఇంటికి సైతం వెళ్లేవారు. ఇలా రషీద్ భార్యతో సన్నిహితంగా మెలిగేవాడు నిందితుడు మున్షిద్దీన్. కానీ గత 15 రోజులుగా మున్షిద్దీన్ ను అడ్డు తొలగించుకోవాలని భార్య భావించటంతో .. ముందుగా పన్నిన పథకం ప్రకారం రషీద్ మద్యం సేవించాక కత్తితో పొడిచి, గొంతు కోసి, శవాన్ని తగులబెట్టాడు. 90శాతం కాలిన గాయాలతో శవాన్ని గుర్తించిన పోలీసులు..ఈ మార్గంలోని సీసీటీవీల ఫుటేజీలను చూసి.. 27 ఏళ్ల నిందితుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi crime: పొడిచి..గొంతు చీల్చి..తగులబెట్టి..ఢిల్లీలో ఘోరాతి ఘోరమైన హత్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES