Woman Pours Boiling Oil: దిల్లీ మదంగిర్ ప్రాంతంలో జరిగిన ఘోరమైన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. అక్టోబర్ 2 తెల్లవారుజామున భార్య సధనా తన భర్త.. దినేష్‌పై వేడి నూనె పోసి, ఆపై మిరప పొడి చల్లింది. ఈ దాడి సమయంలో దంపతులకు ఉన్న 6 నెలల శిశువు కూడా పక్కనే నిద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దినేష్ సఫ్దర్జంగ్ ఆసుపత్రి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటన అక్టోబర్ 2 తెల్లవారు జామున 3:15 గంటల సమయంలో జరిగిందని పోలీసులు వెల్లడించారు. దంపతులు రెండు రోజుల క్రితం గొడవ పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఘటన జరిగిన ఆ రాత్రి పెద్ద గొడవ తర్వాత భర్త నిద్రపోయినప్పుడు సధనా వంటగదిలో నూనె వేడి చేసి దినేష్‌పై పోసింది. దీంతో అతను కేకలు వేస్తుండగా అమానవీయంగా ప్రవర్తించి మిరప పొడి కూడా చల్లింది.
భర్త కేకలకు ఒక్కసారిగా భయంతో పొరుగువారు బయటకు పరుగెత్తి తలుపులు తట్టారు. కానీ సధనా తెరవలేదు. అయితే బాధతో విలపిస్తున్న దినేష్ కేకలు వేస్తూ తన భార్య వేడి నూనె పోసి మిరప పొడి చల్లిందని చెప్పినట్లు అక్కడివారు వెల్లడించారు. అయితే ఇంటి యజమాని తండ్రి అతని మరిదికి ఫోన్ చేయగానే తలుపు తెరిచారని.. అప్పుడు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించినట్లు అంజలి వెల్లడించారు.
తనపై వేడి నూనెతో భార్త దాడి చేసిన తర్వాత శరీరం మండిపోవడంతో మెలకువ వచ్చిందని.. తన భార్య పక్కనే నిలబడి మిరప పొడి చల్లిందని బాధితుడు పోలీసులకు చెప్పాడు. దాడి జరిగిన సమయంలో కేకలు వేస్తే ఇంకా వేడి నూనె పోస్తానని భార్య బెదిరించినట్లు దినేష్ చెప్పాడు. తమకు పెళ్లై 8 ఏళ్లు అయ్యిందని, తాను మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తున్నట్లు అతను వెల్లడించాడు. గతంలో కూడా చిన్నచిన్న గొడవలు జరిగాయని, పోలీసుల దాకా వెళ్లిన మ్యాటర్ సర్థుమణిగి కలిసి జీవిస్తున్నట్లు వెల్లడించాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


