Delhi Man Rapes 65-Year-Old Mother: సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా దిగజారుతున్నాయో చెప్పే మరో దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. కన్నతల్లిని రెండుసార్లు అత్యాచారం చేసిన ఒక కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తన తల్లికి ఉన్న సంబంధాలపై పగతో, ఆమెను శిక్షించాలని అలా చేసినట్లు నిందితుడు చెప్పడం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 65 ఏళ్ల బాధితురాలు తన 25 ఏళ్ల చిన్న కూతురితో కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొడుకు, భర్త, కూతురితో కలిసి నివాసం ఉంటున్న ఈ కుటుంబం ఇటీవల సౌదీ అరేబియా నుంచి యాత్ర ముగించుకొని తిరిగి వచ్చారు.
ALSO READ: Son killed by mother : కన్నపేగు బంధాన్ని కాటేసిన కామం… కుమారుడిని కడతేర్చిన కసాయి తల్లి!
నా బాల్యాన్ని చెడగొట్టావు..
యాత్రలో ఉన్నప్పుడు, కొడుకు తన తండ్రికి ఫోన్ చేసి వెంటనే తిరిగి రావాలని, తల్లికి విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఆమెకు గతంలో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. ఆగస్టు 1న తిరిగి వచ్చిన తర్వాత, నిందితుడు తన తల్లిని గదిలో బంధించి, హింసించి, ఆమెను “నా బాల్యాన్ని చెడగొట్టావు” అని నిందించాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి పారిపోయి పెద్ద కూతురి ఇంట్లో ఆశ్రయం పొందింది.
అయితే, ఆగస్టు 11న ఆమె తిరిగి వచ్చిన తర్వాత, మళ్ళీ వేధింపులు మొదలయ్యాయి. అదే రోజు రాత్రి ఆమెను మళ్ళీ ఒక గదిలో బంధించి నిందితుడు అత్యాచారం చేశాడు. ఆగస్టు 14న రెండోసారి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు తన చిన్న కూతురికి జరిగిన విషయం చెప్పడంతో, ఆమె ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని ప్రోత్సహించింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది.


