Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుInfant Murder: 'డిప్రెషన్‌'తో 45 రోజుల పసికందు గొంతు కోసి చంపిన కన్నతల్లి

Infant Murder: ‘డిప్రెషన్‌’తో 45 రోజుల పసికందు గొంతు కోసి చంపిన కన్నతల్లి

Mother Slits 45-Day-Old Baby’s Throat: తీవ్రమైన ‘డిప్రెషన్‌’తో బాధపడుతున్న ఓ తల్లి, కేవలం 45 రోజుల వయసున్న తన పసికందు గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయాన్ని పోలీసులు శుక్రవారం ధృవీకరించారు.

- Advertisement -

ALSO READ: Cricket Bat: క్రికెట్ బ్యాట్ కోసం 10 ఏళ్ల బాలిక దారుణ హత్య.. కత్తితో 21 సార్లు పొడిచి

“ప్రాథమిక విచారణలో తల్లి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది” అని అదనపు డీసీపీ దిశేష్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. నిందితురాలు నేహా ఈ నేరాన్ని అంగీకరించిందని, ఆమెపై బీఎన్‌ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ అగర్వాల్ చెప్పారు.

అంతకు ముందు కూడా..

గురువారం ద్వారకాపురి ప్రాంతంలోని పర్ధి కాలనీలో ఈ ఘటన జరిగింది. నేహా పదునైన వస్తువుతో తన కుమారుడు ప్రియాంశ్ గొంతు కోసి చంపినట్లు విచారణలో తేలింది. నిందితురాలిని అరెస్టు చేశారు. అంతకు ముందు కూడా నేహా తన బిడ్డను ఊపిరి ఆడకుండా చేసి చంపడానికి ప్రయత్నించిందని, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమె బంధువులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ: Murder in UP: పెళ్లి ఒత్తిడితో దారుణం: ప్రియురాలిని ఏడు ముక్కలుగా నరికిన ప్రియుడు..!

ఈ దారుణం జరిగినప్పుడు నేహా తన ఆడపడుచు బయట బట్టలు ఉతుకుతుండగా, బిడ్డకు ఏదో జరిగిందని అరుస్తూ పిలిచిందని పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా, పసికందు గొంతుపై గాయంతో చనిపోయి పడి ఉంది. ఈ ఘటన గురించి వెంటనే కుటుంబ సభ్యులు, పొరుగువారికి సమాచారం ఇచ్చారు. నేహా చేతులపై రక్తపు మరకలు ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ALSO READ: Extramarital affair : మనుమళ్లను ఎత్తుకునే వయసులో..కామంతో కట్టుకున్నోడినే కాటికి పంపింది!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad