ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య(Suicide)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
ఆమె ఆత్మహత్యకు కారకుడిపై చట్టప్రకారం చర్యలుంటాయని తెలిపారు. నాగాంజలి సూసైడ్ నోట్ మేరకు ఇప్పటికే ఆస్పత్రి ఏజీఎం దీపకన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు పవన్ తెలిపారు. విద్యార్థినులు, యువతుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నల్లపు దుర్గారావు కుమార్తె నాగాంజలి రాజమండ్రిలోని బోలినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నారని సమాచారం. ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ ఒకరు ప్రేమ పేరుతో మోసం చేయడంతో మనస్థాపానికి గురై తను చనిపోయినట్లుగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వారి దగ్గర నుంచి సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మృతిపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి, మృతికి గల కారణాలను వెలికి తీయాలని, అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు.
Pawan: ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES