Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుDGP: అవార్డ్ కోసం పోలీస్ స్టేషన్స్ అన్నీ పోటీ పడాలి

DGP: అవార్డ్ కోసం పోలీస్ స్టేషన్స్ అన్నీ పోటీ పడాలి

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్ పురస్కారాన్ని పొందేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు పోటీ పడాలని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించే దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ పురస్కారాన్ని సాధించేందుకు సన్నద్ధతపై అన్ని పోలీస్ కమీషనలు, ఎస్.పి లు, గతంలో ఉత్తమ్ పోలీస్ స్టేషన్ పురస్కారాలు పొందిందిన ఎస్.హెచ్.ఓ లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రాచకొండ కమీషనర్ డీ.ఎస్ చౌహాన్, ఐజి లు కమలాసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి షా నవాజ్ ఖాసీం లు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, 2024 సంవత్సరానికి గాను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించే జాతీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డులను పొందేందుకై ఇప్పటి నుండే మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. 2022 లోని సమాచారం ప్రకారంగా 2023 సంవత్సరానికి, 2023 క్యాలెండర్ సంవత్సర సమాచారం ప్రాతిపదికగా 2024 సంవత్సరానికి ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును ప్రకటించడం జరుగుతుందని వివరించారు. 2017 లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే రెండవ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా, 2019, 2018లో రాచకొండ కమీషనరేట్ పరిధిలోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్ దేశంలో 13 వ ఉత్తమ పోలీస్ స్టేషంగా, 2019 లో చొప్పదండి పోలీస్ స్టేషన్ కు 8 వ స్థానం, 2021 లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు 10 స్థానం జాతీయ స్థాయిలో లభించాయని డీజీపీ గుర్తుచేశారు. రాష్ట్రంలోని 75 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో ఆలేరు పోలీస్ స్టేషన్ ప్రధమ స్థానాల్లో నిలిచిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం నుండి ఉత్తమ పోలీసింగ్ ప్రతిభను సాధించిన మూడు పోలీస్ స్టేషన్లను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి స్వీకరిస్తుందని తెలిపారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో సాధించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటారని అన్నారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో రాష్ట్రంలోని మెరుగైన పోలీసింగ్ విధానాల అనుసరించి 30 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశామని తెలిపారు. ఈ 30 పోలీస్ స్టేషన్లతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా జాతీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ పురస్కారాన్ని సాధించేందుకై పోటీ పడాలని అంజనీ కుమార్ తెలియ చేశారు.
CCTNS డాటా ప్రాతిపదికగా దాదాపు 80 శాతం మార్కులు విధిస్తారని, మిగిలిన 20 శాతం మార్కులు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, పౌరుల ఫీడ్ బ్యాక్ నుండి ఉంటాయని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలు, మిస్సింగ్ పర్సన్స్, గుర్తు తెలియని మృత దేహాలు తదితర నేరాలపై ప్రత్యేక ద్రుష్టి సాధించి నియమిత సమయంలోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని అన్నారు. ఈ అంశాలపై సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలతోపాటు ముఖ్యంగా డీ.ఎస్.పి లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ డీజీ షికా గోయల్ పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా ఉత్తమ పోలీస్ స్టేషన్ సాదించేందుకు చేపట్టాల్సిన పాయింట్లను తెలియ చేశారు. తానూ కరీంనగర్ సి.పి గా ఉన్నప్పుడు 2019 , 2020 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ్ పోలీస్ స్టేషన్లుగా చొప్పదండి, జమ్మికుంట పోలీస్ స్టేషన్లు ఎంపిక అవడానికి చేసిన ప్రత్యేక కృషిని ఐ.జి. కమలాసన్ రెడ్డి వివర్ణచారు. గతంలో ఉత్త పోలీస్ స్టేషన్ అవార్డులను సాధించిన ఎస్.హెచ్. ఓ ల అభిప్రాయాలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News