Distracted By Porn, UK Truck Driver Crashes Into Car: బ్రిటన్‌లో జరిగిన ఒక దారుణ రోడ్డు ప్రమాదంలో, మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్ కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. ఈ కేసులో కోర్టు ఆ డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ALSO READ: Woman Half-Burnt: సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం.. MLA మేనల్లుడి దాష్టీకం? నలుగురు అరెస్ట్!
ఈ ఘటన 2024, మే 17న లాంకషైర్‌లోని M58 హైవే సమీపంలో చోటుచేసుకుంది. నీల్ ప్లాట్ (43) అనే ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల డేనియల్ అచ్చిసన్ (46) మరణించారు. స్కాట్లాండ్‌లోని డంఫ్రీస్ నుంచి లివర్‌పూల్‌కు మూడు గంటల పాటు వాహనం నడుపుతున్న సమయంలో ప్లాట్ నిరంతరం తన ఫోన్‌లో X (ట్విట్టర్), వాట్సాప్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియాను చూస్తున్నట్లు కోర్టు విచారణలో తేలింది. ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు, ప్లాట్ X ఫీడ్‌లో పోర్న్ చిత్రాలు చూసినట్లు కూడా నిర్ధారణ అయ్యింది.
ALSO READ: Woman Dies By Suicide: ప్రియుడి హత్య జరిగిన మరుసటి రోజే 18 ఏళ్ల యువతి సూసైడ్
ప్రమాదం జరిగిన సమయంలో అచ్చిసన్ తన కారు హ్యుందాయ్ కోనాని నడుపుతూ, తన భాగస్వామితో హ్యాండ్స్-ఫ్రీ కాల్‌లో ఉన్నాడు. ఈ సమయంలో భారీ ట్రక్ వేగంగా వచ్చి అచ్చిసన్ కారును ఢీకొట్టింది. ఆ ధాటికి కారు ముందు ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టి, మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. అచ్చిసన్ అక్కడికక్కడే మరణించాడు.
ప్రెస్టన్ క్రౌన్ కోర్టులో హాజరైన ప్లాట్.. ప్రమాదకరమైన డ్రైవింగ్ కారణంగా మరణం సంభవించిందని అంగీకరించారు. “మీ అహంకారపూరిత, స్వార్థపూరిత వైఖరి క్షమించరానిది. మీరు ఉద్దేశపూర్వకంగా రహదారి చట్టాలను విస్మరించారు. మీరు ఏ క్షణంలోనైనా ప్రమాదాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్న బహుళ-టన్నుల ప్రమాదం” అని న్యాయమూర్తి ఇయాన్ అన్స్‌వర్త్ ప్లాట్ చర్యలను తీవ్రంగా ఖండించారు.
మా హీరో మా నుంచి వెళ్లిపోయాడు..
రోడ్డు భద్రత కంటే సోషల్ మీడియా చూడడానికే ప్లాట్ ప్రాధాన్యత ఇచ్చారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్లాట్‌కు పదేళ్ల జైలు శిక్షతో పాటు, ఏడేళ్ల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించారు. బాధితుడి భార్య, కూతురు కోర్టులో తమ ఆవేదనను వ్యక్తపరిచారు. “మా హీరో మా నుంచి వెళ్లిపోయాడు. పిల్లలకు ఈ విషయం చెప్పడం నా జీవితంలో అత్యంత కష్టమైన పని” అని భార్య కన్నీరు పెట్టుకున్నారు.
ALSO READ: Woman Kidnapped: తాగుబోతు భర్తని విడిచి యువకుడితో మహిళ సహజీవనం.. కిడ్నాప్ చేసిన బంధువులు


