Drunk Man Throws 3-Month-Old Infant Son In Gorge: ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మూడు నెలల కుమారుడిని రోడ్డు పక్కన ఉన్న లోయలోకి విసిరి చంపి, ఆ తర్వాత తానూ అదే లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాద సంఘటన మంగళవారం జరిగింది. మృతుడు లలిత్ (30) నేపాల్ దేశానికి చెందినవాడు, ల్యాన్స్‌డౌన్ ప్రాంతంలోని దబోలి గ్రామంలో నివసిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఈ దారుణానికి దారితీసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లలిత్‌కు మద్యానికి బానిస. మంగళవారం సాయంత్రం, లలిత్‌కు అతని భార్య కమలతో గొడవ జరిగింది. దాంతో ఆమె తమ మూడు నెలల పసికందును తీసుకుని తన సొంత గ్రామానికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరింది.
ఈ క్రమంలో, ఆగ్రహంతో ఉన్న లలిత్ తన భార్య ఒడిలో నుంచి బిడ్డను బలవంతంగా లాక్కుని, రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి విసిరేశాడు.
ALSO READ: Woman Drowns 3 Children: ముగ్గురు పిల్లలను చంపి.. నీళ్ల ట్యాంకులో దూకి తల్లి ఆత్మహత్య
సహాయం అందక తండ్రి మృతి
ఈ దారుణం జరిగిన తర్వాత, ఆ దంపతులు ఇద్దరూ కలిసి తమ బిడ్డ కోసం లోయలో వెతకడానికి ప్రయత్నించారు కానీ, ఫలితం లేకపోయింది. తీవ్ర నిరాశకు గురైన లలిత్ కూడా తన బిడ్డను విసిరేసిన అదే లోయలోకి దూకేశాడు.
స్థానికులు వెంటనే స్పందించి లలిత్‌ను రక్షించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేలోపే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Teen Girl POCSO: ప్రభుత్వ ఆసుపత్రి టాయిలెట్‌లో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. మాజీ ఉద్యోగి అరెస్ట్


