Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుEarthquake: 4,800 మంది సజీవ సమాధి.. టర్కీ, సిరియాలో భీతావాహ దృశ్యాలు

Earthquake: 4,800 మంది సజీవ సమాధి.. టర్కీ, సిరియాలో భీతావాహ దృశ్యాలు

హృదయ విదారకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి టర్కీ-సిరియా సరిహద్దుల్లోని భూకంపం వచ్చిన ప్రాంతాలు. భూకంప ధాటికి ఇప్పటికే 4,800కు పైగా మృతదేహాలు వెలికి తీయగా శిథిలాల కింద మరిన్ని మృతదేహాలున్నట్టు అంచనాలు సాగుతున్నాయి. భారీ బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలటంతో వాటి కింద చాలామంది చిక్కుకుపోయి వారిలో కొందరు ఇంకా ప్రాణాలతో ఉండచ్చని అంచనా వేస్తున్నారు. వందలసార్లు భూమి కంపిచంటంతో నిన్నంతా ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని.. మరోవైపు రాత్రంతా చలికి వణికిపోయారు టర్కీ, సిరియా వాసులు. పదేపదే భూమి కంపించటం.. భవనాలు కూలిపోవటం చూసిన వీరిలో చాలామంది ప్రళయం సంభవించిందని భావిస్తున్నారు.

- Advertisement -

ఇక గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసి, వారికి వైద్య సదుపాయాలు కల్పించే పనుల్లో టర్కీ మునిగిపోయింది. పాతిక వేలకు మంది వరకూ గాయపడి ఉండచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News