ED summons Google and Meta in betting app case: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాలకు సమన్లు పంపింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఈరెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా గూగుల్, మెటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.
బెట్టింగ్ యాప్‌లతో మనీలాండరింగ్, హవాలా వంటి ఆర్థిక నేరాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా గూగుల్, మెటా రెండూ బెట్టింగ్ యాప్‌లను తమ మాధ్యమాల్లో ప్రమోట్ చేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ టెక్ దిగ్గజాలు బెట్టింగ్ యాప్‌ల యాడ్స్ కు స్లాట్స్ కేటాయించడమే కాకుండా బ్‌సైట్ల లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.
Also Read: Telegram Task Scam – బ్యాంకు ఉద్యోగిని భూమిక సొరాథియా ఆత్మహత్య
మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం విస్తృత స్థాయిలో ఉంది. సెలిబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం వల్ల ఆకర్షితులైన ఎంతో మంది అమాయకులు డబ్బు పొగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్స్ పై ఈడీ ECIR నమోదు చేసింది. ఇప్పటిక టాలీవుడ్ నటులైన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మంచు లక్ష్మీ, శ్రీముఖి వంటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న 29 మంది సెలెబ్రిటీలను ఈడీ విచారించనుంది.


