Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుEmmiganuru: ప్రభుత్వ కార్యాలయాలపై అ.ని.శా. నిఘానేత్రం ?

Emmiganuru: ప్రభుత్వ కార్యాలయాలపై అ.ని.శా. నిఘానేత్రం ?

రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ ,రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేసి అధికారులపై పంజా విసురుతున్నారు. దీంతో ఆయా ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోనీ తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని విధులు నిర్వహించే అధికారులు భయపడుతూ తమ విధులను కొనసాగిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల నిఘానేత్రం తమ కార్యాలయాలపై ఉందంటూ, అవినీతి నిరోధక శాఖ అధికారులు రెక్కీ నిర్వహిస్తున్నారని రెవెన్యూ, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బంది గుసగుసలాడుతున్నాయి. ఏసీబీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందనే సమాచారం ఆ నోట ఈ నోట పడి పుకార్లు షికారులు చేయడంతో అధికారులు సెలవులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొంత మంది అధికారులు సిబ్బంది తమ ఇంటిపై వేసుకున్న బంగారం ఇతర విలువైన వస్తువులును ఇంటి వద్దే పెట్టీ వస్తున్నట్లు తెలిసింది. మామూళ్లు తీసుకుంటున్న డబ్బు ను వారి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయా కార్యాలయాల సిబ్బంది చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులకు వేల రూపాయలు జీతాలు వస్తున్న ఇంకా ప్రజలను పట్టి పీడించి ఆయా కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వారి నుండి మామూళ్లను ముక్కు పిండి వసూలు చేసే అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం మంచిదేనంటూ ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక పని జరగాలంటే ఎంతో కొంత మామూళ్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News