Monday, December 9, 2024
Homeనేరాలు-ఘోరాలుEx Constable | దొంగలతో దోస్తీ చేసిన మాజీ పోలీస్ హత్య

Ex Constable | దొంగలతో దోస్తీ చేసిన మాజీ పోలీస్ హత్య

దొంగలతో దోస్తీ చేసిన మాజీ కానిస్టేబుల్ (Ex Constable) అదే దొంగల ముఠా చేతిలో హత్యకు గురయ్యాడు. చేసే దొంగ పనుల్లో విబేధాలు తలెత్తడంతో అతనిని పక్కా ప్లాన్ తో మరో వర్గం హత్య చేసింది. మాజీ కానిస్టేబుల్ ఈశ్వర్ ఉద్యోగంలో ఉండగానే చైన్ స్నాచర్లతో పిక్ ప్యాకెటింగ్ దొంగలతో స్నేహం మొదలుపెట్టాడు. దొంగ సొమ్ముకి ఆశపడి పలు కేసుల్లో పిక్ ప్యాకెటింగ్, చైన్ స్నాచర్లను తప్పించాడు. వ్యవహారం అధికారుల దృష్టికి చేరడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో హైదరాబాద్ నుంచి చెన్నై మకాం మార్చిన ఈశ్వర్ కొన్నేళ్లుగా చైన్ స్నాచింగ్ లు, పిక్ పాకెటింగ్ లకు పాల్పడుతున్నాడు.

- Advertisement -

చెన్నైలో ముఠా ఏర్పాటు చేసుకుని మట్కా పిక్ పాకెటింగులు చేయిస్తున్నాడు. ఇంతలో దొంగల ముఠాలతో ఈశ్వర్ కి విబేధాలు తలెత్తాయి. ప్రత్యర్ధులు సెటిల్మెంట్ చేసుకుందామని ఈశ్వర్ ని నమ్మకంగా హైదరాబాద్ పిలిపించారు. హైదరాబాద్ వచ్చిన అతనిపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం క్రితం దాడికి పాల్పడ్డారు. కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. గాయాలపాలైన ఈశ్వర్ ఐదు రోజులుగా విశ్వాస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకున్న సరూర్నగర్ పోలీసులు.. మాజీ కానిస్టేబుల్ (Ex Constable) ఈశ్వర్ పై దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో ముగ్గురు పరారీలో ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News