Gambling dens in Warangal: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ మాజీ ఎమ్మెల్యే .. జూదంలో పాల్గొంటూ పోలీసులకు చిక్కాడు. ప్రజా ప్రతినిధిగా చట్టాల రూపకల్పనలో పాలుపంచుకున్న వ్యక్తి ఇలా వార్తల్లో నిలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఆయనో మాజీ ఎమ్మెల్యే. పరిపాలనలో పాలుపంచుకున్న నాయకుడు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి .. ఇళ్లునే పేకాట స్థావరంగా మార్చుకుని జూదంలో పాల్గొన్నాడు. వరంగల్ మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు. పక్కా సమాచారంతో మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే నివాసంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరపు దాడి చేశారు. గత కొన్నాళ్లుగా జూదం ఆడుతున్నారన్న సమచారంతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read:https://teluguprabha.net/crime-news/up-woman-slits-wrist-at-police-station-as-nephew-ends-affair/
కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంట్లో ఆయనతో పాటుగా.. మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ సహా 13 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 3.68 లక్షల నగదు,సెల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పేకాటలో కరెన్సీకి బదులుగా కాయిన్స్ (ప్లాస్టిక్)తో పేకాట ఆడుతూ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
రామన్నపేట ప్రాంతానికి చెందిన పరిశల నాగరాజు, పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, చింతం సంతోష్, సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన మేరు వీరేశం ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో చింతం సంతోష్‌పై గతంలో పేకాట శిబిరాలు నిర్వహించినట్లు పలు కేసులు నమోదు అయినట్టు సమాచారం. అధిక వడ్డీకి నగదు లావాదేవీలు సైతం కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి.


