Father kills childrens: లోకమంటే ఏంటో తెలియని పసిబిడ్డలని కన్న తండ్రి అతిదారుణంగా చంపాడు. అమ్మ ఒడిలో సేదదీరాల్సిన ఆ చిన్నారులను బావిలో పడేసిన హృదయవిదారక ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.
ఆడపిల్లగా పుట్టడమే శాపమా?: కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్‌లో ఉండే శ్లీశైలం దంపతులకు పండంటి కవలపిల్లలు పుట్టారు. ఆ దంపతులు తమ కవల ఆడపిల్లలకు గీతాన్ శ్రీ, గీతాన్విక అని ఎంతో ముద్దుగా పేరు పెట్టుకున్నారు. కానీ పిల్లలు పుట్టిన నాటి నుండి “ఆడపిల్లలేనా?” అంటూ భార్యతో శ్రీశైలం నిత్యం గొడలపడుతుండేవాడు. బంధువులు ఎంత సర్దిచెప్పినా వినలేదు. చివరకు కసాయి వాడిలా మారి తన కవల బిడ్డలకు గడ్డి మందు తాగించి.. అత్యంత క్రూరంగా బావిలో పడేసి హతమార్చాడు.
నిందితుడికి దేహశుద్ధి: ఈ అమానుష ఘటన గురించి తెలియగానే ఊరు ఊరంతా ఉలిక్కిపడింది. బావిలో వెతకగా ఒక పాప మృతదేహం లభ్యం అయ్యింది. మరో పాప కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్నబిడ్డలను కడతేర్చిన ఆ కిరాతకుడిని చూసి గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడు శ్రీశైలానికి అక్కడికక్కడే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Also read-Crime: యువతి దారుణ హత్య.. మృతదేహం ముక్కలు ఫ్రిడ్జ్‌లో లభ్యం!
విచారణ చేపట్టిన పోలీసులు: ఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం ఆడపిల్లలు పుట్టారనే కోపమా? లేక భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఈ ఘాతుకానికి కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

