Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. తన ఇద్దరు చిన్నారులను అతి కిరాతకంగా చంపాడు. ఆ తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అన్ని కోణాల్లో దర్యాప్తు: తొర్రూర్‌లోని మార్కెట్ ఎదురుగా ఉన్న చెట్టుకు షావలి (35) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి కారణమా? లేక ఆర్థిక ఇబ్బందులా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read-Suicide: కుమార్తె పెళ్లి చేసిన కొద్దిసేపటికే తండ్రి ఆత్మహత్య.. మేకలే కారణం!
శోకసముద్రంలో కుటుంబం: ఒకేసారి తండ్రితో పాటు ఇద్దరు పసిపిల్లలు మృత్యువాత పడటంతో బాధితుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కళ్లముందే ఆడుకోవాల్సిన పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

