Father pushed childrens into river: “రండమ్మా.. చాలా రోజులు అయ్యింది కదా అలా బయటకు వెళ్లద్దాం” అంటూ తండ్రి ప్రేమగా పిలవగానే.. ఆ చిట్టి హృదయాలు ఉత్సాహంతో ఉప్పొంగిపోయాయి. నాన్నతో ఏంచక్కా బయట తిరుగచ్చని గంతులేశారు. పాపం ఆ చిన్నారులకు తెలియదు.. కన్న తండ్రే కసాయిగా మారుతాడని. అదే వారి చివరి ప్రయాణమని.. ఇక ఎప్పటికీ వెనక్కిరామని ఆ చిట్టి హృదయాలకు తెలియదు. “అమ్మా.. నాన్నతో అలా బయటకు వెళ్లస్తామమ్మా” అంటూ తండ్రితో బయటకు వెళ్లారు. అయితే అభం, శుభం తెలియని ఆ చిన్నారులను కసాయి తండ్రి కడతేర్చాడు. చివరికి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన కన్నీళ్లు తెప్పిస్తుంది.
గుండెలు పగిలే విషాదం: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో ఉండే శిరిగినీడి దుర్గాప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. అయితే తనది ప్రేమ వివాహం. పెద్దల ఒప్పందంతో నాగవేణి అనే అమ్మయిని పెళ్లిచేసుకున్నాడు. దీంతో వీరికి పండంటి ఇద్దరు పిల్లలు జన్మించారు. కుమారుడు మోహిత్ (13), కుమార్తె జాహ్నవి (9)తో వారి జీవితం జీవితం సంతోషంగా సాగుతుంది. పిల్లలిద్దరినీ విశ్వేశ్వరాయపురంలో చదివిస్తున్నాడు. నాగవేణి తండ్రి రేకపల్లి వెంకటేశ్వరరావు గల్ఫ్ నుంచి రావడంతో వారం క్రితం వీరంతా ఆ ఊరు వెళ్లారు. అయితే వారి వద్దకు ఆదివారం దుర్గాప్రసాద్ వెళ్లాడు. ఆధార్ అప్‌డేట్ చేయాలంటూ సోమవారం ఉదయం పిల్లలలిద్దరినీ తీసుకొని దుర్గాప్రసాద్ బైకుపై బయటకు వెళ్లారు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో .. నాగవేణి కుటుంబం ఆందోళనతో గాలించడం ప్రారంభించారు. సోమవారం రాత్రి యలమంచిలి స్టేషన్ పరిధి చించినాడ వశిష్ఠ వారధిపై ఈ వాహనం, పాదరక్షలు, చరవాణి నంబర్లతో కూడిన కాగితం కనిపించాయి. మంగళవారం ఉదయం గోదావరిలో గాలించగా దుర్గాప్రసాద్, మోహిత్ మృతదేహాలు కనిపించాయి. జాహ్నవి ఆచూకీ మాత్రం ఇంకా కానరాలేదు. అయితే పాప ఆచూకీ కోసం అన్వేషిస్తున్నామని మలికిపురం ఎస్సై సురేశ్ తెలిపారు.
సరదాకు అనుకున్నాం: ఇద్దరు పిల్లలతో వంతెన మీదకు వచ్చిన దుర్గాప్రసాద్ తొలుత కుమార్తెను నదిలోకి తోసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇది చూసిన కుమారుడు హడలిపోయి పరుగు తీయగా అతడిని తండ్రి వెంబడించినట్లు అటుగా వెళ్లిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. దుర్గాప్రసాద్ తన కుమారుడితో సరదాగా పరుగెడుతున్నాడని అనుకున్నట్టుగా డ్రైవర్ తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అస్సలు ఊహించలేదని పేర్కొన్నాడు. అయితే పిల్లలతో పాటుగా తాను సైతం ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.
పాపం ఏం కష్టమొచ్చిందో: ఇద్దరు పిల్లలతో సహా దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని బంధువులు, స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ కలహాలా.. ఆర్థిక సమస్యలా.. మరింకేమైనా కారణం ఉందా తెలియాల్పి ఉంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

