Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుCrime: మద్యం మత్తులో మరో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం..

Crime: మద్యం మత్తులో మరో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం..

Father Rapes Daughter In Prakasam District Kondapi: ఏదైనా కష్టం వస్తే నాన్నా అని తలచుకుంటాం.. కానీ ఆ నాన్నే సమస్యగా మారితే ఆ పాప ఎవరికి చెప్పుకొంటుంది. ఆప్యాయంగా కూతురిని తడమాల్సిన చేతులు.. కామంతో రగిలిపోయాయి. తన రక్తంతో పెరిగిన కూతురి అవయవాలను వక్రబుద్ధితో చూసి కీచక పర్వానికి ఒడిగట్టాడు. కష్టసుఖాల్లో నేనున్నానంటూ నడిపించాల్సిన తండ్రి.. కసాయిలా మారాడు. మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడి ఆ చిన్ని మనసుపై జీవితాంతం మాసిపోని గాయం ముద్రించాడు. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పుకోలేక తనలో తానే తల్లడిల్లిపోయింది ఆ పసిప్రాణం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటన.. ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/crime-news/pregnant-woman-dies-6-months-after-marriage-family-alleges-dowry-harassment-by-police-clerk-husband/

ప్రకాశం జిల్లా కొండపి మండలంలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఇది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కొండపి మండలంలోని ఓ గ్రామంలో మద్యానికి బానిసైన తండ్రి.. కొన్ని రోజుల క్రితం తన రెండో కూతురు(12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. 

ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేక తల్లడిల్లిపోయిన ఆ చిన్నారి.. కొన్ని రోజుల తర్వాత కడుపు నొప్పి రావడంతో తల్లికి చెప్పింది. దీంతో ఆస్పత్రిలో చూపించగా వైద్యులు చెప్పిన విషయాలు విని ఆమె కూలబడిపోయింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో షాక్‌ అయిన తల్లి.. బోరున విలపిస్తూ కూతురిని ఇంటికి తీసుకువచ్చింది. 

Also Read: https://teluguprabha.net/crime-news/mentally-challenged-mother-kills-her-two-children-then-dies-by-suicide-in-up/

అయితే ఆ తల్లికి మరెవరిపైనా అనుమానం రాలేదు. ఇంట్లోని తన భర్తపైనే సందేహం కలిగింది. గతంలోనే తన భర్త కూతురిపై చేతులు వేసి తడుముతున్నట్లు గుర్తు చేసుకున్న ఆమె.. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలిపింది. చివరికి బాలికను ఆరా తీయగా తనపై తండ్రి చేసిన అఘాయిత్యాన్ని బోరున విలపిస్తూ చెప్పింది.

వెంటనే ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ప్రస్తుతం ఆ కీచకుడు పరారీలో ఉండటంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad