Fevikwik Attack on Students in Hostel:సాధారణంగానే పిల్లలు ఆకతాయి పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండే పిల్లలు వారి తల్లిదండ్రుల భయంతోనో లేదా బడిలో ఉపాధ్యాయులు కొడతారనో కాస్త అనిగిమనిగి ఉంటారు. కానీ హాస్టల్‌లో ఉండే పిల్లలు సరదా కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. సరిగ్గా ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. సలాగూడలోని సేవాశ్రమం స్కూల్‌కు చెందిన హాస్టల్‌లో నిద్రిస్తున్న తోటి విద్యార్థుల కళ్లలో.. ఓ విద్యార్థి ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
మెరుగు పడని పరిస్థితి: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సేవాశ్రమం స్కూల్ హాస్టల్లో 3, 4వ తరగతులు చదువుతున్న విద్యార్థులు గురువారం రాత్రి తమ గదులలో నిద్రపోయారు. అదే హాస్టల్‌కు చెందిన మరో విద్యార్థి.. తోటి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో 8 మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ గమ్ పోశాడు. దీంతో మరుసటి రోజు ఉదయం ఆ విద్యార్థులు ఎంత ప్రయత్నించినా.. తమ కళ్లను తెరవలేక తెగ ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని సమీపంలోని గోఛపడ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. చికిత్స తర్వాత ఒక విద్యార్థి కళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి. కానీ మిగతా ఏడుగురి పరిస్థితి ఇంకా అలాగే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన విద్యార్థిని పోలీసులు గుర్తించారు.
Also Read:https://teluguprabha.net/crime-news/suspicious-death-of-a-young-man-in-anakapalle/
పుల్‌బనీలోని ఆస్పత్రికి తరలింపు: ఏడుగురు విద్యార్థుల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో.. వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం పుల్‌బనీలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక హాస్టల్ యాజమాన్యంతో పాటుగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ఉందని గ్రామ సర్పంచ్ రోహిత్ కన్హర్ ఆరోపించారు.వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. సర్పంచ్ రోహిత్ కన్హర్ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


