Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుFire Accident | పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident | పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. గోల్డెన్ ఓరియోల్ అపార్ట్‌మెంట్ లోని ఓ ప్లాట్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి అపార్ట్‌మెంట్ లో నివసించేవారంతా బయటకి పరుగులు తీశారు. సిలిండర్ పేలిన ఫ్లాట్ లో నివసించే ఐదుగురు కుటుంబసభ్యులు కూడా బయటకి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.

- Advertisement -

ఈ అగ్ని ప్రమాదం (Fire Accident) లో ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైంది. దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బిల్డర్ నిబంధనలు విరుద్ధంగా అపార్టుమెంటును నిర్మించడంతో ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి దారిలేక అగ్నిమాక సిబ్బంది సుమారు గంటసేపు శ్రమించింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వచ్చినా లోనికి పోవడానికి దారి లేక సిబ్బంది చేతులెత్తేసింది. అనంతరం మరో మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో‌ మంటలు ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నించింది. అప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అపార్టుమెంటు నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad