Saturday, November 15, 2025
HomeTop StoriesAccident: రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 29 మంది!

Accident: రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 29 మంది!

Nalgonda Road accident: రాష్ట్రంలో పెను ప్రమాదం జరిగింది. తాజాగా మరో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం: రోడ్డు ప్రమాద వార్త వింటేనే తెలుగు రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు వారాల నుంచి ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లాలో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేల‌రేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. ప్రయాణికులకు స‌మాచారం అందించాడని తెలుస్తోంది. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

29 మంది ప్రయాణికులు సురక్షితం: డ్రైవర్ సమాచారం అందించిన వెంటనే ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు. అంతలోనే బస్సు పూర్తిగా దగ్ధమైనట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు . ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వారంతా.. సురక్షితంగా ఉన్నారని స‌మాచారం. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలోనే ఏపీలోని కర్నూలులో కావేరి బస్సు దగ్ధమై ఏకంగా 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.

Also Read: https://teluguprabha.net/crime-news/road-accident-in-nalgonda-district/

దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం: గత కొంత కాలంగా తెలుగు ప్రజలు ప్రయాణం అంటేనే జంకుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారాలను చూపాలని కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు, హైవే పెట్రోలింగ్​ సిబ్బంది అవసరమైన చర్యలను చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. వివిధ అవసరాల నిమిత్తం రహదారులపై నిలిపి ఉంచే వెహికల్స్​ను వెంటనే తొలగించేలా చూడాలని కోరుతున్నారు. నిలిపి ఉన్న వాహనాల వద్ద సైన్​ బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా వాహనదారులకు పోలీసులు సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నారు. వాహనదారులు రాంగ్​రూట్​లో వెళ్లకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad