HomeTop StoriesAccident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కాగజ్‌నగర్‌కు చెందిన నలుగురి మృతి

Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కాగజ్‌నగర్‌కు చెందిన నలుగురి మృతి

Maharashtra accident: క్రిస్మస్ పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన దేవాడ్-సోండో సమీపంలో జరిగింది.

- Advertisement -

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మహిళలు మృతిచెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు మరియు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబం వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి వెళ్లారు.

Also read-Tamil Nadu: తమిళనాడులో ఘోర దుర్ఘటన.. 9 మంది మృతి!

వంతెన పైనుంచి కింద పడిన కారు: నాగ్‌పూర్‌లో వైద్యం పూర్తి కావడంతో.. బుధవారం అర్ధరాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మార్గమధ్యలో కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడింది. ఈ ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్ మరియు బంధువులు ఆఫ్జా బేగం, సహారా మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సాయంతో పోలీసులు క్షతగాత్రులను చంద్రపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News