HomeTop StoriesRoad Accident: మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఘాట్‌ రోడ్డులో ఆటో బోల్తా, నలుగురు మృతి

Road Accident: మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఘాట్‌ రోడ్డులో ఆటో బోల్తా, నలుగురు మృతి

Road Accident Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండ -సీతంపేట మార్గంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో ఐదుగురి చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/rs-praveen-sensational-comments-phone-tapping-case/

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆటోలోని ప్రయాణికులంతా సీతంపేట మండలానికి చెందిన గిరిజనులుగా గుర్తించారు. బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News