Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుUttarakhand : తోటలో ఆడుకుంటూ విషపూరిత గింజలు తిన్న చిన్నారులు, ముగ్గురు మృతి

Uttarakhand : తోటలో ఆడుకుంటూ విషపూరిత గింజలు తిన్న చిన్నారులు, ముగ్గురు మృతి

తోటలో ఆడుకుంటున్న నలుగురు చిన్నారులు.. అక్కడున్న ఓ చెట్టుకు కనిపించిన కాయల్ని కోసుకుని వాటిలోని గింజల్ని తినేశారు. ఆ తర్వాత చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్ జిల్లా.. బుగ్గవాలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గత బుధవారం సాయంత్రం షబ్నమ్ (5), షాజియా (5), బసిర్, ఆసిఫా అనే పిల్లలు తమ ఇంటి సమీపంలోని తోటలో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి పన్వర్ అనే విషపూరిత మొక్క కనిపించింది.

- Advertisement -

ఆ మొక్కకు చిక్కుడుగింజల మాదిరి గింజలు ఉన్నాయి. అవి విషపూరితమైనవి. అది తెలియని ఆ చిన్నారులు తినేవే అనుకుని వాటిని తిని ఇంటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే పిల్లల్లో తీవ్రమైన వాంతులు, విరేచనాలు వంటివి మొదలయ్యాయి. వెంటనే ఆందోళనకు గురైన చిన్నారుల కుటుంబ సభ్యులు వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. షబ్నమ్ (5) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్1) మరణించింది.

మరుసటి రోజున షాజియా, ఆదివారం (డిసెంబర్ 4) బసిర్ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆసిఫా డెహ్రడూన్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆసిఫా పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆ ప్రాంతంలోని పన్వర్ మొక్కల్ని ధ్వంసం చేయించినట్లు చెప్పారు. కాగా.. ముగ్గురు చిన్నారులు మరణించినా ఇప్పటికీ.. ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News