Tuesday, September 10, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla- Gudumba on rise: మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా

Garla- Gudumba on rise: మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా

రోగాల బారిన పడుతున్న ప్రజలు

గ్రామాలలో గుడుంబా మళ్ళీ గుప్పుమంటూ, పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతుందని నాటు సారాను అరికట్టే వారు కరువవడంతో, వాడవాడలా ఏరులై పారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక అండర్ గ్రౌండ్ బ్రిడ్జి సమీపంలో తాగి పడేసిన గుడుంబా కవర్లు దర్శనం ఇవ్వడంతో, గుడుంబా విక్రయం ఇంతలా జరుగుతుందా అని నోరేళ్ల పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -

కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఉన్న గుడుంబా కేంద్రాలు మళ్లీ విజృంభిస్తున్నాయని, సారాకు బానిసై అటు జేబులను ఇటు ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటుంటే మద్యానికి బానిసైన వారిని ఆసరాగా చేసుకుని నాటు సారా విక్రయిస్తూ, జేబులు నింపుకుంటున్నారు. సారా తాగి జేబులు గుల్ల చేసుకుంటున్న వారు శారీరకంగా, రోగాల బారిన పడి నలిగిపోతూ ప్రాణాలు కోల్పోతుండటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా వీధిన పడుతున్నాయని, గుడుంబా మహమ్మారి ఇంతలా గ్రామాలను పట్టిపీడిస్తుంటే సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాలలో గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News