Saturday, April 5, 2025
Homeనేరాలు-ఘోరాలుGarla: ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కున్న తల..

Garla: ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కున్న తల..

పాపం అనిపించేలా..

ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చిన ఓ కుక్క దానిని విడిపించుకోలేక అగచాట్లు పడుతోంది. ఆహారం కోసం వెదుకుతూ వెళ్లిన కుక్కల సమూహంలో ఓ శునకం పొరపాటున ప్లాస్టిక్ డబ్బాలో తలదూచింది. ఇక అంతే అప్పటి నుంచి తల బయటకు రాకపోవడంతో నానా పాట్లు పడుతోంది.

- Advertisement -

ఈ ఘటన గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది డబ్బాతోనే తిరుగుతున్న శునకం మూగ వేదనను చూడలేక శునకం తలను బయటకు తీయడానికి ఆటో డ్రైవర్లు హమాలీ కార్మికులు ఎంత ప్రయత్నించడంతో నన్నేమైనా చేస్తారేమో అన్న భయంతో కుక్క అందకుండా పరిగెడుతున్నందున ఫలితం లేకుండా పోతోంది.

ఆహారం, నీరు తీసుకోలేక కుక్క పడుతున్న పాట్లు చూసినవారంతా పాపం అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News