Saturday, October 12, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: యమపాశాలుగా విద్యుత్ తీగలు- అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Garla: యమపాశాలుగా విద్యుత్ తీగలు- అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

విద్యుత్ తీగలు యమ పాషాలుగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి దీంతో సామాన్య ప్రజలు బలవుతున్నారు వీటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలు ఎంత చెప్పినా వారి తీరు మాత్రం మారటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే పునరావృతం అయింది అధికారుల నిర్లక్ష్యానికి మరొక నిండు ప్రాణం బలైంది వివరాల్లోకి వెళితే గార్ల మండల కేంద్రం సమీపంలోని వరి పంట పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తూ విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

- Advertisement -

కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం పూమ్యా తండాకు చెందిన గుగులోతు నితిన్(19) గార్లకు చెందిన కౌలు రైతు కు పురుగుల మందు పిచికారి చేయడానికి కూలి పనికి రాగా శనివారం రాత్రి వీచిన గాలి దుమారానికి విద్యుత్ వైర్లు తెగి పంట పొలంలో పడిపోవడాన్ని రైతు గమనించకపోవడంతో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వైర్లు తెగిపడిన విషయం తెలియకుండా పురుగుల మందు పిచికారి చేస్తున్న క్రమంలో నితిన్ కాలుకు విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే పడిపోయి మృతి చెందాడు. గతంలో ఈ పంట పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగిలి పశువులు మృత్యువాతపడగా సదరు కౌలు రైతు విద్యుత్ శాఖ అధికారులకు తెగిపోయిన విద్యుత్ తీగలు సరిచేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం.

పూమ్యా తండా కు చెందిన గుగులోతు రాములుకు ఇద్దరు కుమారులు కాగా రెండవ కుమారుడైన నితిన్ మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన పురుగుల మందు పిచికారి చేస్తూ విద్యుత్ ఘాతంతో మృతి చెందిన గుగులోతు నితిన్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కౌలు రైతు ఇంటి ఎదుట ఆందోళన చేపట్టడంతో గార్ల బయ్యారం సీఐ రవికుమార్ గార్ల బయ్యారం ఎస్సైలు జీనత్ కుమార్ తిరుపతి రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మృతుడు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని సిఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News