Friday, April 4, 2025
Homeనేరాలు-ఘోరాలుGarla: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

Garla: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారు చేసిన విక్రయించినా చర్యలు తప్పవని అబ్కారి శాఖ స్క్వాడ్‌సీఐ చిరంజీవి హెచ్చరించారు. గార్ల మండల పరిధిలోని బుద్ధారం తండా గ్రామంలో గుడుంబా తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సిఐజి చిరంజీవి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వచేసిన ఎనిమిది వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా గుడుంబా తయారు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్ఐ లు కృష్ణమూర్తి హరీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News