అధునాతన టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతున్నా మూఢ నమ్మకాలు మాత్రం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు జన విజ్ఞాన వేదికలు అధికారులు మూఢనమ్మకాలపై ఎంతగానో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు మూఢనమ్మకాల వైపే వెళ్తున్నారు క్షుద్ర పూజలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
గార్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం చంద్రగిరి వెళ్లే మూలమలుపు సమీపంలోని రహదారిపై మంగళవారం కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, జీడిగింజలు ఇతర వస్తువులు వస్త్రాలు కవర్లతో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపడంతో ఆ రహదారి వైపుగా వెళ్లే వాహనదారులు పాదాచారులు హడాలెత్తిపోతూ భయాందోళనకు
గురయ్యారు. క్షుద్ర పూజలు చేశారా లేక ఈ వస్తువులు తీసుకొచ్చి ఎవరైనా అక్కడ పడేశారా అని ప్రజలు అనుమానిస్తున్నారు. గతంలో పలుమార్లు ఇదే తరహాలో కుంకుమ పూలు నిమ్మకాయలు ఇతర వస్తువులు కనిపించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని కానీ పదేపదేజరుగుతుండటం భయాందోళనకు గురిచేసిందని ఏదేమైనా ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయంకరమైన గురిచేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.