Saturday, November 15, 2025
HomeTop StoriesVizag HPCL Plant Fire: హెచ్‌పీసీఎల్‌లో భారీ పేలుడు.. భయంతో బయటకు పరుగులు తీసిన...

Vizag HPCL Plant Fire: హెచ్‌పీసీఎల్‌లో భారీ పేలుడు.. భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు!

HPCL Plant Fire: విశాఖ నగరంలోని గాజువాకలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్‌యూఎఫ్‌ సైట్‌లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన కార్మికులు భయంతో షెడ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో గాజువాక ప్రాంతంలో కలకలం రేగింది.

- Advertisement -

పైప్‌లైన్ లీకేజీ: హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఈరోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. రఫ్ సైట్ బ్లూషెడ్ వద్ద ఉన్న గ్యాస్ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పైప్‌లైన్ లీకేజీ కారణంగా వేజెల్ పేలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

భయంతో బయటకు పరుగులు: ఈ ఘటన శుక్రవారం ఉదయం 9:20 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. పేలుడు ధాటికి వందలాది మంది కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నష్టం వివరాలు తెలియాల్సి ఉంది: పేలుడు జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు లోపల ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. ప్రమాద స్థలం నుంచి కార్మికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం వల్ల జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad