Gas cylinders explode: ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
క్షతగాత్రులను కదిరి ఆసుపత్రికి తరలింపు: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నివాస గృహంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలు ఎక్కువ కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read-Andaman Sea: పడవ బోల్తా.. 250 మంది గల్లంతు!

