హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై(Foreign Woman) అత్యాచారం జరిగింది. సదరు యువతి సెలవుల నిమిత్తం జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చింది. తన ఫ్రెండ్‌తో కలిసి మంద మలమ్మ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ఉంటుంది. షాపింగ్ కోసం కారులో బయలుదేరగా.. కొందరు యువకులు లిఫ్ట్ కావాలని అడిగారు. అనంతరం బలవంతంగా కారులో ఎక్కి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పహాడీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో కిదిగి ఘటనా స్థలం, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.