Crime : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని సన్‌బీమ్ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఒకరి మరణానికి దారితీసింది.
పదో తరగతి విద్యార్థి ఆదిత్య వర్మ (14) పై తొమ్మిదో తరగతి విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆదిత్య ఛాతీపై మూడు-నాలుగు సార్లు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే రక్తస్రావంతో కుప్పకూలాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ గొడవ బాత్‌రూమ్ సమీపంలో జరిగింది. నిందితుడు కత్తిని నీటి బాటిల్‌లో దాచుకొని స్కూల్‌కు తెచ్చాడు. బ్యాగ్‌లను తనిఖీ చేయకపోవటంతో ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ దాడిలో మరో ఇద్దరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. గాయపడిన విద్యార్ధిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆదిత్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతర ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
మృతుడు యూసుఫ్‌పుర్ ముహమ్మదాబాద్ నివాసి కాగా, నిందితుడు మైనర్ కావడంతో అతడిని జువెనైల్ బోర్డు ముందు హాజరుపరిచేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఆదిత్య తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య కేసు నమోదైంది. స్కూల్ యాజమాన్యంపై నిర్లక్ష్యం ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్కూల్‌లో భయాందోళన నెలకొంది, సెలవు ప్రకటించారు. సమాజంలో హింస పెరుగుతున్న తీరుపై చర్చ జరుగుతోంది.


