Thursday, April 3, 2025
HomeతెలంగాణWazeedu SI: వాజేడు ఎస్ఐ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Wazeedu SI: వాజేడు ఎస్ఐ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Wazeedu SI| తెలంగాణలో సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమని హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు గుర్తించారు.

- Advertisement -

సంవత్సరం క్రితం ఎస్‌ఐ హరీష్‌కు ఓ యువతి రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైందని తెలిపారు. అనంతరం తరుచూ ఫోన్‌లు చేసుకుంటూ ఇద్దరూ క్లోజ్ అయ్యారని.. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే యువతి గురించి ఎస్‌ఐ హరీష్‌ ఆరా తీయగా.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. దీంతో ఆమె బ్యాక్‌గ్రౌండ్ నచ్చక హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు.

ఇదే విషయంపై మాట్లాడేందుకు వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు ఇద్దరు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News