టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఓ ఇద్దరిని అంటి టెర్రరిస్టు స్కాడ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని హైదరాబాద్ కు తరలించారు. మహమ్మద్ జావిద్, అతని కూతురు మహమ్మద్ ఖదీజా వీరు గత నాలుగు సంవత్సరాల నుంచి హైదరాబాదులోనీ టోలి చౌక్ లో నివాసముంటున్నారు. అయితే జావిద్ కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. జావిద్ సాప్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో ప్రత్యేక సాప్ట్ వేర్ తో ఐసిస్ బావాజాలన్ని వ్యాప్తి చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే అతని కూతురు కూడా ఐసిసి భావాజాలాన్ని వ్యాప్తి చేస్తుందా అనే విషయంపై అరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే వీరు గత వారం క్రితం బక్రీద్ పండుగ సందర్బంగా గోదావరిఖని శ్రీనగర్ కాలనీకి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారిద్దరిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో తండ్రి, కూతురును స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తీసుకొని వెళ్లారు. ఏది ఏమైనా మరోసారి కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసు బృందం రంగంలోకి దిగడం చర్చనీయంగా మారింది.
Godavarikhani: గుజరాత్ ఏటిఎస్ దాడులు
గుజరాత్ ATS అదుపులో అనుమానిత టెర్రరిస్టు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES