గోదావరిఖని ఓసిపి ఫోర్ రోడ్డు వద్ద అక్రమంగా నిలువ ఉంచిన 42 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను పట్టుకున్నమనీ, తదుపరి విచారణ నిమిత్తం రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామనీ గోదావరిఖని వన్ టౌన్ సి.ఐ. ఒక్క ప్రకటన తెలిపారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైనా నూతన గృహం నిర్మించుకునే వారు ప్రభుత్వం సరఫరా చేయు ఇసుక పాలసీ నందు బుక్ చేసుకొని తెప్పించుకోవాలనీ, ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసిన ట్రాక్టర్లను లేదా లారీలను సీజ్ చేసి డ్రైవర్ల మీద అట్టి వాహనాల యజమానుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేసి కోర్టు నందు డిపాజిట్ చేయడం జరుగుతుందనీ గోదావరిఖని వన్ టౌన్ సి.ఐ. ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
Godavarikhani: 42 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను పట్టుకున్న పోలీసులు
తెలుగు ప్రభ ఎఫెక్ట్ తో కదిలిన పోలీస్ యంత్రాంగం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES