Friday, December 12, 2025
Homeనేరాలు-ఘోరాలుGold Smuggling: సైకిల్ టైర్లో గోల్డ్ స్మగ్లింగ్.. బంగ్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు

Gold Smuggling: సైకిల్ టైర్లో గోల్డ్ స్మగ్లింగ్.. బంగ్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు

Gold Smuggling Foiled BSF Seizes Gold Hidden in Bicycle Tyre: సరిహద్దుల్లో అక్రమ రవాణా చేయడానికి కేటుగాళ్లు వేసే ఎత్తుగడలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నిత్యం కాపలా కాసే భద్రతా దళాల కళ్లుగప్పేందుకు వారు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా India-Bangladesh Border (భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు)లో జరిగిన ఒక ఘటన ఇందుకు నిదర్శనం. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో Gold Smuggling (బంగారం అక్రమ రవాణా) చేయడానికి ఏకంగా ఒక పాత సైకిల్‌ను వాడుకున్నారు. ఆ సైకిల్ టైరులో గుట్టుచప్పుడు కాకుండా దాచిన రూ. 1.02 కోట్ల విలువైన బంగారాన్ని BSF Seizure (బీఎస్‌ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ALSO READ: Dalit Man Custodial Death: ఖాకీల కస్టడీలో దళిత యువకుడి అనుమానాస్పద మృతి! పోలీసులపై ఎస్సీ/ఎస్టీ కేసు

పక్కా సమాచారంతో కాపు కాసి..

మాల్దాలోని ఎం.ఎస్.పూర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ వద్ద 119 బెటాలియన్ జవాన్లు పహారా కాస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారీగా బంగారం రాబోతోందన్న పక్కా సమాచారం వారికి ముందే అందింది. దీంతో జవాన్లు గద్ద కళ్లతో నిఘా పెట్టారు. మధ్యాహ్నం సుమారు 2:56 గంటల సమయంలో ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ అనుమానాస్పదంగా సరిహద్దు వైపు రావడం వారి కంటపడింది. వెంటనే అతడిని ఆపి తనిఖీలు మొదలుపెట్టారు.

 

చూడటానికి అది సాధారణ పాత సైకిలే. కానీ ముందు టైర్ (Front Tyre) మాత్రం కాస్త వింతగా, ఉబ్బినట్లు గట్టిగా ఉండటాన్ని అధికారులు గమనించారు.

టైర్ విప్పితే కళ్లు బైర్లు కమ్మే దృశ్యం

అనుమానం రావడంతో వెంటనే ఆ టైరును విప్పి చూశారు. అంతే.. అందులో దాచిన దృశ్యం చూసి జవాన్లు ఆశ్చర్యపోయారు. టైర్ లోపల చాలా జాగ్రత్తగా అమర్చిన ఏడు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటిని తూకం వేయగా 816.41 గ్రాములు తేలింది. మార్కెట్లో వీటి విలువ అక్షరాలా రూ. 1,02,40,230 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంత చిన్న టైరులో కోటి రూపాయల సరుకు దాచడం స్మగ్లర్ల తెలివికి అద్దం పడుతోంది.

జనం మధ్యలో జంప్

అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ జరిగింది. జవాన్లు సైకిల్ టైరును పరిశీలించడంలో నిమగ్నమై ఉండగా, ఆ స్మగ్లర్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అది జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో, జవాన్లు కాల్పులు జరపలేకపోయారు. సామాన్యులకు ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో సంయమనం పాటించారు. దీంతో ఆ నిందితుడు జనం రద్దీని ఆసరాగా చేసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎంత వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు.

సమాచారం ఇస్తే బహుమతి

స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖకు అప్పగించారు. బీఎస్‌ఎఫ్ జవాన్ల అప్రమత్తతను ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. సరిహద్దుల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఇందుకోసం ‘సీమా సాథీ’ హెల్ప్‌లైన్ నంబర్ 14419 కు ఫోన్ చేయవచ్చని, లేదా 9903472227 నంబర్ కు వాట్సాప్ చేయవచ్చని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి తగిన బహుమతి కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.

ALSO READ: Businessman Killed: కుర్చీ కవర్ల రంగు నచ్చలేదని హత్య.. గంగా నదిలో శవం! పెళ్లింట విషాదం నింపిన చిన్న గొడవ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News