Sunday, November 16, 2025
HomeTop StoriesTrain Accident: గూడ్స్‌ రైలును ఢీకొన్న ప్యాసింజర్‌.. ఆరుగురు మృతి

Train Accident: గూడ్స్‌ రైలును ఢీకొన్న ప్యాసింజర్‌.. ఆరుగురు మృతి

Chhattisgarh Train Accident: మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. జైరామ్‌నగర్ స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/tejashwi-yadav-promise-to-give-30k-to-woman/

ఘటనాస్థలికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో ట్రైన్‌ మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల సమయంలో లాల్‌ ఖదాన్‌ ప్రాంతంలో ప్యాసింజర్‌-గూడ్స్‌ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. 

ఘటన జరిగిన వెంటనే సమీపంలోని జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు, పోలీసులు,.. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్య సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రమాదంలో బిలాస్‌పూర్‌- హావ్‌డా లైన్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్ల సర్వీసులను రద్దు చేయగా మరికొన్నిటిని దారి మళ్లించారు. ప్రమాదంతో ఎలక్ట్రిక్‌ వైర్లు, సిగ్నల్‌ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. దెబ్బ తిన్న కోచ్‌లను పట్టాల నుంచి తొలగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad