నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి , డి.ఎస్.పి రవీంద్రనాథ్ రెడ్డి, నంద్యాల రూరల్ సీఐ శివ కుమార్ రెడ్డి సూచనల మేరకు గోస్పాడు మండల SI నాగార్జున రెడ్డి, సిబ్బంది కలిసి ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గోస్పాడు మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా చూడాలనే ఉద్దేశంతో BSF సిబ్బంది 45 మంది, గోస్పాడు పోలీస్ ఫోర్స్ తో కలిసి సాంబవరం, దీబగుంట, కానాలపల్లి గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్/ ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా సదరు ఏరియాలో నివసించు ప్రజలకు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించే విధంగా భరోసా కల్పించారు. గ్రామంలో ఉన్న రౌడీలు, నాయకులు, సాధారణ ప్రజలతో కలిపి మీటింగ్స్ పెట్టి వారికి తగు హెచ్చరికలు, ఎన్నికలకు సంబంధించిన పనుల గురించి వివరించారు.
Gospadu: అల్లర్లకు పాల్పడితే జీవితాలు నాశనం
కవాతుతో ఓటర్లలో ధైర్యం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES