Homeనేరాలు-ఘోరాలుMiryalaguda: మిర్యాలగూడలో విషాదం.. బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించబోయి తాత మృతి!

Miryalaguda: మిర్యాలగూడలో విషాదం.. బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించబోయి తాత మృతి!

Miryalaguda: నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిపోయిన మనవడిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఓ తాత.. ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలచివేసింది. ఈ ప్రమాదం మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామంలో జరిగింది.

- Advertisement -

అసలేం జరిగిందంటే: ఊట్లపల్లి గ్రామానికి చెందిన వెంకన్న (53) మనవడు (నాలుగేళ్లు) ఆడుకుంటూ వెళ్లీ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బాలుడి కేకలు విన్న తాత వెంకన్న.. క్షణం కూడా ఆలోచించకుండా మనవడిని రక్షించేందుకు తానే స్వయంగా బోరుబావిలోకి దిగారు. అయితే దురదృష్టవశాత్తు బాలుడిని కాపాడే క్రమంలో ఆయన కూడా అందులోనే చిక్కుకుపోయారు.

పోలీసుల సహాయక చర్యలు: సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర శ్రమకోర్చి బోరుబావిలో చిక్కుకున్న తాత, మనవడు ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో తాత వెంకన్న (53) శ్వాస ఆడక ప్రాణాలు విడిచారు. మనవడి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి తాత మృత్యువాత పడటంతో ఊట్లపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News