Crime : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం ఓ మహిళను ఆమె భర్త, అత్తామామలు కిరాతకంగా హత్య చేశారు. సిర్సా గ్రామానికి చెందిన నిక్కీ (28) అనే మహిళను గురువారం రాత్రి ఆమె భర్త విపిన్ భాటి, అత్త దయా, మామ సత్యవీర్, బావమరిది రోహిత్ కలిసి దారుణంగా కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో నిక్కీ 70% కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరినప్పటికీ, దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. నిక్కీ అక్క కంచన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విపిన్‌ను అరెస్ట్ చేశారు. అత్త, మామ, బావమరిది పరారీలో ఉన్నారు.
ALSO READ: Chandrababu : ఎరువుల ధరలు పెంచితే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు హెచ్చరిక!
2016లో నిక్కీ, కంచన్‌లను సిర్సా గ్రామానికి చెందిన విపిన్, రోహిత్ అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లిలో స్కార్పియో కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, బంగారం, నగదు ఇచ్చినప్పటికీ, అత్తింటివారు రూ.36 లక్షల అదనపు కట్నం డిమాండ్ చేసి నిక్కీ, కంచన్‌లను వేధించారని కంచన్ తెలిపింది. గురువారం రాత్రి నిక్కీని గదిలో బంధించి కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆమె ఆరోపించింది. ఈ దారుణాన్ని నిక్కీ ఆరేళ్ల కొడుకు చూశాడు. “నాన్న, నానమ్మ నా అమ్మపై ఏదో పోసి, కొట్టి, లైటర్‌తో నిప్పు పెట్టారు” అని బాలుడు మీడియాకు చెప్పాడు. కంచన్ రికార్డు చేసిన వీడియోలో విపిన్, అత్త నిక్కీ జుట్టు పట్టి లాగడం, కొట్టడం, ఆమె కాలుతూ మెట్లపై నడవడం కనిపించింది. పోలీసులు ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిక్కీ తండ్రి భిఖారీ సింగ్ పాయలా దోషులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.


